శ్రీ గణేశాయ నమః | శ్రీ గణేష శారదా సద్గురుభ్యో నమః
శ్రీమాన్ మహారుద్ర హనుమతే సద్గురు స్వరూపీ శ్రీ సీతారామచంద్ర దేవతాభ్యోనమ :
శ్రీ లక్ష్మి వెంకటేశాభ్యాం నమః | శ్రీ కుల స్వామిన్యైనమః | శ్రీ సమర్ధదాస స్వామినే నమః | శ్రీ గురు గోవిందమహరాజ్ పరమ సమర్థ
శ్రీరామ చంద్రుడు సపరివారముతో నూతనంగా నిర్మించిన "శ్రీరామ జన్మభూమి మందిరము"లో కొలువైన శుభ తరుణంలో, అయోధ్య నగరంలో శ్రీ దాస నవమి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మాఘ బ॥ పాడ్యమి నుండి మాఘ బ॥ నవమి వరకు జరిగిన ఈ ఆధ్యాత్మిక యాత్రలో భక్తులు రామనామ స్మరణతో పునీతులయ్యారు.
"ధన్యతీ అయోధ్య ధన్యతెతితెజన :" అన్న సమర్థుల వారి వాక్య ప్రమాణముగా, శ్రీరాముని బాల స్వరూపంలో దర్శించుకుంటూ 9 రోజులు నవవిధ భక్తిని సీతారాముల చరణాలకు భక్తులు సమర్పించారు.