Kala Bhairava Ashtakam Lyrics in Telugu: కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామిని స్తుతించే అత్యంత శక్తివంతమైన స్తోత్రం కాల భైరవ అష్టకం. భయం, దారిద్రం మరియు గ్రహ దోషాల నుండి విముక్తి పొంది, సకల కార్యాల్లో విజయం సాధించడానికి ఈ అష్టకాన్ని ప్రతిరోజూ పఠించడం ఉత్తమం.

Kala Bhairava Ashtakam Lyrics in Telugu - కాల భైరవ అష్టకం:


Kala Bhairava Ashtakam in Telugu:


దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరమ్ ।
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 1 ॥

భానుకోటి భాస్వరం భవబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్ధ దాయకం త్రిలోచనమ్ ।
కాలకాల మంబుజాక్ష మస్తశూన్య మక్షరం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 2 ॥

శూలటంక పాశదండ పాణిమాది కారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్ ।
భీమవిక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 3 ॥

భుక్తి ముక్తి దాయకం ప్రశస్తచారు విగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహమ్ ।
నిక్వణన్-మనోజ్ఞ హేమ కింకిణీ లసత్కటిం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 4 ॥

ధర్మసేతు పాలకం త్వధర్మమార్గ నాశకం
కర్మపాశ మోచకం సుశర్మ దాయకం విభుమ్ ।
స్వర్ణవర్ణ కేశపాశ శొభితాంగ నిర్మలం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 5 ॥

రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం
నిత్య మద్వితీయ మిష్ట దైవతం నిరంజనమ్ ।
మృత్యుదర్ప నాశనం కరాళదంష్ట్ర భూషణం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 6 ॥

అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం
దృష్టిపాత నష్టపాప జాలముగ్ర శాసనమ్ ।
అష్టసిద్ధి దాయకం కపాలమాలికా ధరం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 7 ॥

భూతసంఘ నాయకం విశాలకీర్తి దాయకం
కాశివాసి లోక పుణ్యపాప శోధకం విభుమ్ ।
నీతిమార్గ కోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాల భైరవం భజే ॥ 8 ॥

కాల భైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్య వర్ధనమ్ ।
శోకమోహ లోభదైన్య కోపతాప నాశనం
తే ప్రయాంతి కాల భైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్ ॥

ఇతి శ్రీమచ్చంకరాచార్య విరచితం కాల భైరవ అష్టకం సంపూర్ణమ్.


Thank you for reading Kala Bhairava Ashtakam Lyrics in Telugu.

ఇవి కూడా చదవండి (Related Posts):

Follow us on YouTube channel