Sri Rudram Laghunyasam Lyrics In Telugu : పరమశివుని అనుగ్రహం కోసం చేసే అత్యంత పవిత్రమైన శ్రీ రుద్రం పారాయణానికి ముందు చేసే లఘున్యాసం.
ఈ మంత్రాల వల్ల శరీరం మరియు మనస్సు శుద్ధి చెంది, శివ తత్త్వం సిద్ధిస్తుంది.
ఓం అథాత్మానగ్‍మ్ శివాత్మానగ్ శ్రీ రుద్రరూపం ధ్యాయేత్ ||
శుద్ధస్ఫటిక సంకాశం త్రినేత్రం పంచ వక్త్రకమ్ |
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితమ్ ||
నీలగ్రీవం శశాంకాంకం నాగ యఙ్ఞోప వీతినమ్ |
వ్యాఘ్ర చర్మోత్తరీయం చ వరేణ్యమభయ ప్రదమ్ ||
కమండల్-వక్ష సూత్రాణాం ధారిణం శూలపాణినమ్ |
జ్వలంతం పింగళజటా శిఖా ముద్ద్యోత ధారిణమ్ ||
వృష స్కంధ సమారూఢమ్ ఉమా దేహార్థ ధారిణమ్ |
అమృతేనాప్లుతం శాంతం దివ్యభోగ సమన్వితమ్ ||
దిగ్దేవతా సమాయుక్తం సురాసుర నమస్కృతమ్ |
నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువ-మక్షర-మవ్యయమ్ |
సర్వ వ్యాపిన-మీశానం రుద్రం వై విశ్వరూపిణమ్ |
ఏవం ధ్యాత్వా ద్విజః సమ్యక్ తతో యజనమారభేత్ ||
అథాతో రుద్ర స్నానార్చనాభిషేక విధిం వ్యాక్ష్యాస్యామః |
ఆదిత ఏవ తీర్థే స్నాత్వా ఉదేత్య శుచిః ప్రయతో బ్రహ్మచారీ శుక్లవాసా దేవాభిముఖః స్థిత్వా ఆత్మని దేవతాః స్థాపయేత్ ||
ప్రజననే బ్రహ్మా తిష్ఠతు |
పాదయోర్-విష్ణుస్తిష్ఠతు |
హస్తయోర్-హరస్తిష్ఠతు |
బాహ్వోరింద్రస్తిష్టతు |
జఠరేఅగ్నిస్తిష్ఠతు |
హృదయే శివస్తిష్ఠతు |
కంఠే వసవస్తిష్ఠంతు |
వక్త్రే సరస్వతీ తిష్ఠతు |
నాసికయోర్-వాయుస్తిష్ఠతు |
నయనయోశ్-చంద్రాదిత్యౌ తిష్టేతామ్ |
కర్ణయోరశ్వినౌ తిష్టేతామ్ |
లలాటే రుద్రాస్తిష్ఠంతు |
మూర్థ్న్యాదిత్యాస్తిష్ఠంతు |
శిరసి మహాదేవస్తిష్ఠతు |
శిఖాయాం వామదేవాస్తిష్ఠతు |
పృష్ఠే పినాకీ తిష్ఠతు |
పురతః శూలీ తిష్ఠతు |
పార్శ్యయోః శివాశంకరౌ తిష్ఠేతామ్ |
సర్వతో వాయుస్తిష్ఠతు |
తతో బహిః సర్వతోఅగ్నిర్-జ్వాలామాలా-పరివృతస్తిష్ఠతు |
సర్వేష్వంగేషు సర్వా దేవతా యథాస్థానం తిష్ఠంతు |
మాగ్‍మ్ రక్షంతు |
అగ్నిర్మే వాచి శ్రితః | వాగ్ధృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
వాయుర్మే ప్రాణే శ్రితః | ప్రాణో హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
సూర్యో మే చక్షుషి శ్రితః | చక్షుర్-హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
చంద్రమా మే మనసి శ్రితః | మనో హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
దిశో మే శ్రోత్రే శ్రితాః | శ్రోత్రగ్ం హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఆపోమే రేతసి శ్రితాః | రేతో హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
పృథివీ మే శరీరే శ్రితాః | శరీరగ్ం హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఓషధి వనస్పతయో మే లోమసు శ్రితాః | లోమాని హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఇంద్రో మే బలే శ్రితః | బలగ్ం హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
పర్జన్యో మే మూర్ద్ని శ్రితః | మూర్ధా హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఈశానో మే మన్యౌ శ్రితః | మన్యుర్-హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
ఆత్మా మ ఆత్మని శ్రితః | ఆత్మా హృదయే | హృదయం మయి | అహమమృతే | అమృతం బ్రహ్మణి |
పునర్మే ఆత్మా పునరాయు రాగాత్ | పునః ప్రాణః పునరాకూతమాగాత్ |
వైశ్వానరో రశ్మిభిర్-వావృధానః | అంతస్తిష్ఠత్వమృతస్య గోపాః ||
అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య, అఘోర ఋషిః, అనుష్టుప్ చందః, సంకర్షణ మూర్తి స్వరూపో యోఅసావాదిత్యః పరమపురుషః స ఏష రుద్రో దేవతా |
నమః శివాయేతి బీజమ్ | శివతరాయేతి శక్తిః | మహాదేవాయేతి కీలకమ్ | శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||
ఓం అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః |
దర్శపూర్ణ మాసాత్మనే తర్జనీభ్యాం నమః |
చాతుర్-మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః |
నిరూఢ పశుబంధాత్మనే అనామికాభ్యాం నమః |
జ్యోతిష్టోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః |
సర్వక్రత్వాత్మనే కరతల కరపృష్ఠాభ్యాం నమః ||
అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః |
దర్శపూర్ణ మాసాత్మనే శిరసే స్వాహా |
చాతుర్-మాస్యాత్మనే శిఖాయై వషట్ |
నిరూఢ పశుబంధాత్మనే కవచాయ హుమ్ |
జ్యోతిష్టోమాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
సర్వక్రత్వాత్మనే అస్త్రాయఫట్ |
భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||
ధ్యానం
ఆపాతాళ-నభఃస్థలాంత-భువన-బ్రహ్మాండ-మావిస్ఫురత్-
జ్యోతిః స్ఫాటిక-లింగ-మౌళి-విలసత్-పూర్ణేందు-వాంతామృతైః |
అస్తోకాప్లుత-మేక-మీశ-మనిశం రుద్రాను-వాకాంజపన్
ధ్యాయే-దీప్సిత-సిద్ధయే ధ్రువపదం విప్రోఅభిషించే-చ్చివమ్ ||
బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలిత-శశికలా-శ్చండ కోదండ హస్తాః |
త్ర్యక్షా రుద్రాక్షమాలాః ప్రకటితవిభవాః శాంభవా మూర్తిభేదాః
रुద్రాః శ్రీరుద్రసూక్త-ప్రకటితవిభవా నః ప్రయచ్చంతు సౌఖ్యమ్ ||
ఓం గణానామ్ త్వా గణపతిగ్ం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ ||
మహాగణపతయే నమః ||
శం చ మే మయశ్చ మే ప్రియం చ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ ఋతం చ మే అమృతం చ మే అయక్ష్మం చ మే అనామయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వం చ మే అనమిత్రం చ మే అభయం చ మే సుగం చ మే శయనం చ మే సూషా చ మే సుదినం చ మే ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||
Thank you for watching Sri Rudran Laghunyasam Lyrics - శ్రీ రుద్రం లఘున్యాసం
And follow us on YouTube channel
ఈ శ్రీ రుద్రం లఘున్యాసం మరియు ఇతర వేద మంత్రాలు కేవలం సామాన్య భక్తుల పారాయణ సౌలభ్యం కోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి. కంప్యూటర్ టైపింగ్ మరియు ఫాంట్ పరిమితుల వల్ల ఉచ్చారణలో (స్వరాలలో) ఏవైనా దోషాలు దొర్లి ఉండవచ్చు.
వేద పండితులు మరియు బ్రాహ్మణోత్తములు దయచేసి ఈ చిన్న పొరపాట్లను మన్నించి, మాకు సహకరించవలసిందిగా ప్రార్థన.
టైపింగ్ వల్ల ఏవైనా తప్పులు దొర్లితే, వాటిని పెద్ద మనసుతో క్షమించమని కోరుతున్నాము. మీ సూచనల ద్వారా ఆ తప్పులను వెంటనే సరిచేయగలము.