Totakashtakam in Telugu: ఆదిశంకరాచార్యుల శిష్యుడైన తోటకాచార్యుల వారు రచించిన అత్యంత భక్తిపూర్వకమైన స్తోత్రం తోటకాష్టకం. ఈ స్తోత్రం యొక్క ప్రాముఖ్యత మరియు పరిచయం ఇక్కడ వివరించడం జరిగింది.

Totakashtakam in telugu - తోటకాష్టకం.

విదితాఖిల శాస్త్ర సుధా జలధే మహితోపనిషత్-కథితార్థ నిధే । హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 1 ॥

కరుణా వరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదమ్ । రచయాఖిల దర్శన తత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 2 ॥

భవతా జనతా సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే । కలయేశ్వర జీవ వివేక విదం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 3 ॥

భవ ఎవ భవానితి మె నితరాం సమజాయత చేతసి కౌతుకితా । మమ వారయ మోహ మహాజలధిం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 4 ॥

సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శన లాలసతా । అతి దీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 5 ॥

జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామాహ సచ్ఛలతః । అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 6 ॥

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం న హి కోఽపి సుధీః । శరణాగత వత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 7 ॥

విదితా న మయా విశదైక కలా న చ కించన కాంచనమస్తి గురో । దృతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణమ్ ॥ 8 ॥

Thank you for watching Totakashtakam in telugu - తోటకాష్టకం.

Please watch to the Lyrics of Vishnu Suktam విష్ణు సూక్తమ్