ఆది పర్వం ప్రథమ శ్వాసం 2 (మహా భారతం):

శమంతక పంచకము :
ఉగ్రశ్రవసుడు చెబుతున్న మహాభారతాన్ని వినుచున్న శౌనకాది మునులు 
శౌనకాది మునులు ఉగ్రశ్రవసువునితో అయ్యా మాకు శమంతక పంచకం గురించి వివరించండి. మహా భారత కథకు మూలమేమిటో వివరించండి భీష్మాది కురువీరుల గురించి సవివరంగా వినాలని ఉంది అన్నారు. కృతయుగాంతంలో దేవదానవ యుద్ధం జరిగినది. త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధం జరిగినది. ద్వారపరయుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది. త్రేతాయుగ ద్వారపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి ఆ రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచాడు. వాటిని శమంతక పంచకం అంటారు. ఆ శమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేసారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయింది.
అర్జునుని ముని మనుమడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమ అనే దేవ శునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జన మేజయుని తమ్ములు శ్రుత సేనుడు, భీమ సేనుడు, ఉగ్ర సేనుడును వారు వచ్చి సారమేయుడిని కొట్టారు. సారమేయుడు ఏడుస్తూ తల్లికి చెప్పాడు. సరమ జనమేజయునితో నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు ఇది అధర్మం. ఇలాంటి పనులు చేసే వారికి ఆపదలు వస్తుంటాయి అని చెప్పినది. జనమేజయుడు దేవశునకం అయిన సరమ పలుకులు విని శాంతి కర్మలు చేయింటానికి సంకల్పించాడు. అందుకు శోమశ్రవుడు అనే మహా మునిని పురోహితునిగా నియమించుకున్నాడు.
Thank you for watching ఆది పర్వం ప్రథమ శ్వాసం 2 (మహా భారతం)
And follow us on Facebook

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!