Brahmamokate Para Brahmamokate – Annamacharya Sankeertana :

తందనాన భళా – తందనాన

బ్రహ్మ మొకటే పర – బ్రహ్మ మొకటే – పర
బ్రహ్మ మొకటే – పర బ్రహ్మ మొకటే

కందువగు హీనాధికము లిందు లేవు
అందరికి శ్రీహరే అంతరాత్మ
ఇందులో జంతుకుల మంతా ఒకటే
అందరికీ శ్రీహరే అంతరాత్మ

నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే
అండనే బంటు నిద్ర – అదియు నొకటే
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే
చండాలుడుండేటి సరిభూమి యొకటే

అనుగు దేవతలకును అల కామ సుఖ మొకటే
ఘన కీట పశువులకు కామ సుఖ మొకటే
దిన మహోరాత్రములు – తెగి ధనాఢ్యున కొకటే
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు

కొరలి శిష్టాన్నములు తును నాక లొకటే
తిరుగు దుష్టాన్నములు తిను నాక లొకటే
పరగ దుర్గంధములపై వాయు వొకటే
వరస పరిమళముపై వాయు వొకటే

కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే
పుడమి శునకము మీద బొలయు నెండొకటే
కడు పుణ్యులను – పాప కర్ములను సరి గావ
జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే

 

Thank you for watching Brahmamokate Para Brahmamokate – Annamacharya Sankeertana

Please watch to Shiva Bhujanga Stotram – శివ భుజంగ స్తోత్రం

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!