వివిధ రకాలైన రామాయణం వివరాలు :

 

సంస్కృత సాహిత్యంలో వాల్మీకి రామయణం తరువాత అంతగా ప్రసిద్ధంకాని రామాయణాలలో పేర్కొనదగినవి:

  • అద్భుత రామాయణం
  • ఆనంద రామాయణం
  • ఆధ్యాత్మిక రామాయణం లేక భుసుండి రామాయణం.
  • మహా రామాయణం లేక యోగ వాశిష్థము.

అద్భుత రామాయణం.

ఇది అన్ని రామాయణాలలో కన్న చిన్నది; నిజానికి ఇది వాల్మీకి రామాయణానికి అనుబంధమయినట్టు- అద్భుతోత్తర కాండమని చెబుతారు. ఇది 27-సర్గలది. దీనిలోని ప్రధానభావాలలో ఒకటి పరాశక్తిగా సీతాదేవి మహత్యాన్ని చిత్రించడం. ఈమె ఈ పరాశక్తి అవతారంలో మహాభయంకరుడైన సహస్రకంఠరావణుడ్ని సంహరిస్తుంది. సీతాసహస్ర నామస్తోత్రం ఒకటి ఈ అద్భుత రామాయణంలో చెప్పబడింది. నారదుని ద్వారా సంగీత కళయొక్క భక్తితత్వం దీనిలో చెప్పబడింది. రాముడు పరశురామునికి, హనుమంతునికి తన విశ్వరూపాన్ని, తక్కిన అవతారాలను చూపుతాడు. దశగ్రీవరావణుని మించిన రావణుల వినాశంలో వానరులయొక్క సీతాదేవి యొక్క పాత్రను అద్భుతీకరించే కధలున్ను ఈలాంటి రామాయణమే థాయిలాండ్ లోని రామాయణకుడ్య చిత్రాలకు కారణమయినది;  త్యాగరాజుల వారు ఈలాంటి కధలను మనస్సులో పెట్టుకొనే శ్రీజనకతనయే అని, కలకంఠీ రాగంలోను, దేవి తనపదభోక్తం అని శాహనరాగం లోను పాడిఉంటారని పరిశోధకుల అభిప్రాయం.

ఆనంద రామాయణం.

ఆనంద రామాయణం కుడా అద్భుత రామాయణం లానే రామకధలోని, రాముని చర్యలలోని మతతత్త్వ అద్భుతాంశాలనే వర్ణింస్తుంది. కాని ఇది అద్భుత రామాయణం కన్నా చాలా విస్తృతం. ఇది శివపార్వత్య సంవాదరూపంలో ఉన్న 109 అధ్యాయాల, 9 కాండల గ్రంధం. భక్తి వేదాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం, రాముడు పరబ్రహం.రామమంత్రం, రామసహస్రనామస్తోత్రంతో పాటు పెక్కు స్తోత్రాలు, పూజావిధి, రామనామజపం, పెక్కు కొత్తకధలు -వీటిలో కొన్ని రాముని సోదరులకు సంబంధించినవి. రాముని దక్షిణభారతయాత్రలో దక్షిణాపధంలోని క్షేత్రాలపేర్లు, ముఖ్యంగా తమిళనాడులోని క్షేత్రాల పేర్లు దీనిలో విస్తారంగా వర్ణితంకావటం గమనింపతగ్గ విషయం. రాముడు 15 శ్లోకాలలో సీతకు వేదాంత తత్త్వం ఉపదేశిస్తాడు. దీనిని దేహరామాయణమని దీనిని ప్రతివాడు తనలో భాగంగా చేసుకోవాలని, మనస్సులో దీనిని దాచుకోవాలని అంటాడు.

ఆధ్యాత్మిక రామాయణం లేక భుసుండి రామాయణం.

ఆనంద, అద్భుత రామాయణాలతో పోల్చి చూస్తే ఆధ్యాత్మిక రామాయణం చాలా వ్యాప్తి చెందినట్లు తెలియుచున్నది. దీనిని పారాయణం చేసేవారు, పూజించేవారు, వ్యాఖ్యానించేవారు ఎక్కువ. దీనికి వ్యాఖ్యలు కూడా చాలా ఉన్నాయి. తమిళ, మలయాళ, హిందీలోని రామాయణాలు- హిందీలో  తులసీదాసు రామచరిత మానసం, మలయాళంలో ఎళుతుచ్చన్ ఆధ్యత్మరామాయణ కిళిపాట్టు వంటివి-ఆధ్యాత్మిక రామాయణానికి అతిసన్నిహితమైనవి.

ఈ ఆధ్యాత్మిక రామాయణం పేరుకు తగ్గట్టు రాముణ్ణి పరబ్రహ్మగా నిరూపించి, రామగీతవంటి ఆధ్యాత్మికోపదేశాలు కూడా చేస్తుంది. ఆధ్యాత్మిక రామాయణం శివుడు ప్రాస్వతికి ఉపదేశించినట్లు రచింపబడింది. తులసీదాసు రామచరిత మానస ఉత్తరకాండలో కాకభుసుండని కధ వస్తుంది. ఈ కాకభుసుండుడు గరుడునితో రామమహత్మ్యం గురుంచి, రామభక్తిని గురుంచి చర్చిస్తూ, తన జీవితం, తాను ఎలా కాకి అయిపుట్టిందీ తెలియజేస్తాడు. కాకభుసుండుని కధ, దానిదైవమూలం యోగవాశిష్ఠం చివర నిర్వాణకాండ ప్రథమభాగం 14-27 అధ్యాయాలలో చెప్పబడ్డాయి.

ఈకాకభుసుండుడు ఎవడు? అన్న ప్రశ్నకు సమాధానం ఆది రామాయణం అని లిఖిత పుస్తకాలలో కనిపించే సంస్కృతం రామాయణంలో లభిస్తుంది.ఈ రామయణం లిఖితపత్రులు ఎక్కువగా లేకపోయినా, సమగ్రమైనవో, అసమగ్రమైనవో బరోడా, ఉదయ్ పూర్, జైపూర్, మధురా, రేవా, అయోధ్య, బనారస్, కలకత్తా, లండన్ లిఖిత గ్రంధాలయాలలో లభిస్తున్నాయి.

మహా రామాయణం లేక యోగ వాశిష్థము.

యోగ వాశిష్థములో రామునికి ఆయన గురువు   వశిష్ఠుడు తత్త్వోపదేశం చేస్తాడు.ఈ మహారామాయణం పూర్తిగా జ్ఞాన మార్గాన్ని వర్ణించటం వల్లనే దీనికి మహారామాయణమని, జ్ఞాన వాశిష్థమని, యోగవాశిష్ఠమని, మోక్షోపాయనమని పేర్లు వచ్చాయి. ఇది 6 ఖంఢాల మహాగ్రంధం. రసవత్తరమైన శైలిలో ఆఖ్యానోపాఖ్యాలతో హృదయంగమంగా ఉంటుంది. దృష్టివాదం-సృష్టివాదం వంటి గహన తత్త్వ విషయాలను ఇది చెబుతున్నది. దీనిని   విద్యారణ్యుడు  విశేషంగా ఉదహరించారు. మొగల్ చక్రవర్తుల కాలంలో దీనిని సన్యాసులు హెచ్చుగా ఆదరించారు.   అక్బర్   చక్రవర్తి   దారా శిఖోహ్ దీని విషయాలను శ్రద్ధగా వినేవారని చరిత్రకారులు వ్రాసారు. దీనినే పారశీక భాషలోకి అనువదించారు కూడా.

వాశిష్ఠ రామాయణం.

వాశిష్ఠ రామాయణం అనేది ఆధ్యాత్మికంగా మిగతా రామాయణాలకి భిన్నం. ఇది 7 అధ్యాయాల గ్రంధం. దీనిని వశిష్ఠోత్తర రామయణం అని కూడా అంటారు. దీనికే శతముఖ రావణచరితం, సహస్రముఖ రావణ చరితం, సీతా విజయం \’ అనే పేర్లు ఉన్నాయి. దీనిలో సీత శతకంఠ రావణుని ధ్వంసం చేస్తుంది. కొన్ని లిఖిత పుస్తకాలు దీనిని జైమిని భారతంలో భాగంగా, కొన్ని      స్కంద పురాణము లోని వశిష్ఠ సంహితలో భాగంగా పేర్కొంటున్నవి.

ఇవే కాక రామాయణానికి సంబంధించి పలు ఇతర గ్రంధాలు సంస్కృతంలో రచింపబడినవి.అందులో ముఖ్యంగా:

మైరావణ చరిత్ర.

మైరావణ చరిత్ర, లేక అహిమహిరావణ చరిత్ర అనే పేరుతో చాల లిఖిత పుస్తకాలున్నాయి. ఇటీవలి వరకు దీనిని   హరి కథగా చెప్పేవారు. దీనిని జైమిని భారతంలో భాగంగా పేర్కొన్నారు. కాని కొందరు పండితులు దీనితో ఏకీభవించరు.

కుశలో పాఖ్యానము.

కుశలో పాఖ్యానము అనే రామకధకు సమబందించిన భాగం మరొకటున్నది. ఇది జైమిని భారతంలో భాగం. జైమినీయ అశ్వమేధంలో ఈ కుశలో పాఖ్యానము 25-36 అధ్యాయాలుగా ముద్రితమైనది. జైమినీయ అశ్వమేధంలోని ప్రధాన ఇతివృత్తం      యుధిష్టురుడు   పట్టాభిషేకం తర్వాత .      అశ్వ మేధ యాగం    చేయటం, ప్రసక్తాను ప్రసక్తంగా ఇందులో రామాశ్వమేధకధ చెప్పబడింది. ఈ కధలో పద్మపురాణంలోని పాతాళఖండంలో ఉన్న కధలలోలాగ రామపశ్చాత్తాపం, సీతారామ లవకుశ సమాగమం, రాముడు సీతా సమేతుడై అశ్వమేధయాగం ఆచరించటం వర్నితమయినాయి.

ఇవే కాకుండా, \”సత్యోపాఖ్యానం, రామరాజ్యం, దేవీ భాగవతం, పద్మపురాణం, స్కంద పురాణం\” మొదలగు గ్రంధాలలో రామకధను వివరించుట జరిగింది.

Thank you for watching వివిధ రకాలైన రామాయణం వివరాలు.
And follow us on YouTube channel

Leave a Reply

error: Content is protected !!