Dasabodha Introduction with Ramadasa swami

Dasabodha Introduction with Ramadasa swami

శ్రీ రామదాసు స్వామి పరిచయం:

🙏 ఓం నమో నారాయణాయ !

స్వాగతం,

📜 Coming Soon

దాసబోధ గ్రంథంలోని మొత్తం 20 దశకాలు (Dashakalu), 200 సమాసాలు (Samasalu)
తెలుగు లిపి మరియు మూల మరాఠీ ఒవీలతో కూడిన పోస్టులు త్వరలో ప్రచురితమవుతాయి.

ప్రతి దశకం యొక్క ప్రత్యేక పేజీ మరియు అందులోని 10 సమాసాలూ స్వతంత్రంగా చూడటానికి సులభంగా అందుబాటులో ఉంటాయి.

🔔 ప్రారంభం: ప్రథమ దశకము నుండి
📖 లభించేది: తెలుగు లిపిలో మరియు మూల మరాఠీ ఒవీలతో!

Namo Narayanaya Bhakthi Channel కు!

ఈ content  post ( or వీడియో) లో మనం

భక్తి, జ్ఞానం, వైరాగ్యానికి  ప్రతీక అయిన

శ్రీ సమర్థ రామదాసు స్వామి గారి పరిచయాన్ని…

అలాగే ఆయన రచించిన ఆధ్యాత్మిక మార్గదర్శక గ్రంథం —

దాసబోధ విశిష్టతలను  తెలుసుకుందాం…

శ్రీ రామదాసు స్వామి గారు సమర్థ రామదాసు అని ప్రసిద్ధి గాంచారు. ఆయన (1608–1681) మహారాష్ట్ర రాష్ట్రంలోని జల్నా జిల్లాలోని జాంభ్ సమీపంలోని జాంబ్ గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణ సూరి లేదా నారాయణ తాత్య. ఆయన తండ్రి సూర్యాజీ పంత్, తల్లి రాణుబాయి. వీరు ఇద్దరూ కూడా పవిత్రమైన బ్రాహ్మణులు.

శివభక్తుడిగా జన్మించిన రామదాసు స్వామి, తరువాత రాముని భక్తి మార్గం లో నడిచారు

చిన్ననాటి నుంచే ధార్మికత, భగవంతునిపై శ్రద్ధ ఎక్కువగా ఉండేది. ఆయన స్వామి తులసీదాస్, శ్రీమద్బాగవతం, రామాయణం వంటి గ్రంథాల ప్రభావంలో పడి, భక్తి, జ్ఞానం, ధర్మ మార్గాల కలయికతో సమాజానికి మార్గదర్శకుడిగా మారారు.

చాలా చిన్న వయసులోనే కుటుంబ జీవితం వదిలేసి, భగవంతుని సేవలో జీవితాన్ని అర్పించారు.

తాండాలే గ్రామంలో ఉన్న కొండపై తపస్సు చేశారు.

అనంతరం చిళతర గ్రామంలో నివసించేవారు. అక్కడే ఆయన మఠాన్ని స్థాపించి అనేక శిష్యులకు ఉపదేశం చేశారు.

ఆయన జీవిత లక్ష్యం, ప్రజల్లో ధర్మం, జ్ఞానం, దేశభక్తిని పెంపొందించడం. ఆయన ఛత్రపతి శివాజీ మహారాజు కు ఆధ్యాత్మిక మార్గదర్శకుడిగా కూడా ఉన్నారు. రామదాసు స్వామి స్వయంగా దేశోద్ధారణ, ధర్మ పరిరక్షణ కోసం పరాక్రమం, భక్తి, జ్ఞానం అనే మూడు మార్గాలను సమన్వయపరిచారు.

స్వామి భక్తి – రామ భక్తి:

ఆయన జీవితంలో ప్రధాన ఆదర్శం శ్రీరాముడు. ఆయన “రామదాసు”గా ప్రసిద్ధి చెందడమే దీనికి ధృవీకరణ.

“శ్రీరామ జయరామ జయ జయ రామ” నామస్మరణను మహా శక్తిగా భావించారు.

ఆయనను “సమర్థ గురు” అని శిష్యులు, అనుయాయులు పిలిచేవారు.

🔹 శివాజీ మహారాజు తో సంబంధం:

ఛత్రపతి శివాజీ మహారాజు కు రామదాసు స్వామి ఆధ్యాత్మిక గురువు.

దేశభక్తి, ధర్మ పరిరక్షణలో శివాజీకి ప్రేరణ ఇచ్చినవాడు రామదాసు స్వామి.

ఆయన రాసిన పత్రాలు, సందేశాలు శివాజీకి ధైర్యాన్ని ఇచ్చాయి.

దాసబోధ గ్రంథ ప్రారంభ విశేషతలు:

దాసబోధ అనేది రామదాసు స్వామి రచించిన అతి మహత్తరమైన గ్రంథం. ఇది మఠంలో, శిష్యులకు ఉపదేశం రూపంలో చెప్పారు. ఈ గ్రంథం ఒవీ రూపంలో (ఛందస్సులాంటి శైలిలో) రచించబడింది. దాసబోధలో మానవ జీవితంలో ధర్మం, భక్తి, జ్ఞానం, రాజకీయ నైపుణ్యం, ధన వ్యవహారం, రాజనీతి, మోక్ష మార్గం వంటి అనేక అంశాలను చర్చించారు.

దీనిని 20 దశకాలు, ఒక్కో దశకంలో 10 సమాసాలుగా విభజించారు. 20 దశకాలలో మొత్తము 200 సమసములుగా విభజించారు. ప్రతి సమాసంలో ఎన్నో ఒవీలు (చెరుపుట పంక్తులు) ఉన్నాయి.మొత్తం దాదాపు 7751 ఒవీలు ఈ గ్రంథంలో ఉన్నాయని భావిస్తారు.

Dasabodha introduction

దాసబోధ గ్రంథ విశిష్టతలు:

ప్రతిక్షణ జీవితానికి మార్గదర్శకమైన ఉపదేశాలు – భక్తులు, సాధకులు, సన్యాసులు, గృహస్థులు – అందరికీ ఉపయోగపడేలా ఉంటుంది.

రాజకీయ & ధర్మ సందేశం – ధర్మ రాజ్య స్థాపన, ధీర్షణ మరియు సేవాభావంతో దేశాన్ని పరిపాలించాల్సిన మార్గాలను వివరించటం.

బోధనా విధానం సులభం – కథల, ఉదాహరణల ద్వారా తత్త్వాన్ని వివరించడం.

భాషా సరళత & గంభీరత – సాధారణ ప్రజలు కూడా అర్థం చేసుకునేలా ఉంటుంది.

ఆధ్యాత్మికత + ఆచరణాత్మక జీవితం – మోక్ష మార్గం చెప్తూనే, భౌతిక ప్రపంచంలో ధర్మబద్ధంగా జీవించాల్సిన విధానం సూచిస్తుంది.

ఇది మరాఠీ భాషలో, కానీ సాధారణ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పబడింది.

🔸 విషయాల విభాగం:

ఆత్మజ్ఞానం – ఆధ్యాత్మికత

వివేకం, బుద్ధి, ధైర్యం

ధర్మం, న్యాయం, నీతి

గృహస్థాశ్రమ ధర్మాలు

వాణిజ్యం, ధనం, రాజనీతి

భక్తి మార్గం, జ్ఞాన మార్గం

మానసిక శాంతి, ధైర్యాన్ని పెంపొందించడం

గురువు శిష్య సంబంధం

నామస్మరణ మహత్త్వం

సదాచారం, మానవ మూల్యాలు

🕉️  ముగింపు:

 సమర్థ రామదాసు స్వామి మన జాతికి, ధర్మానికి వెలకట్టలేని సంపదను ఇచ్చారు – అదే దాసబోధ. ఈ దాసబోధ, సనాతన ధర్మంలోని ఒక అపూర్వ మణిక్యంలాంటిది. ఇది మానవ జీవితాన్ని మార్గనిర్దేశనం చేస్తూ, భక్తి, జ్ఞానం, కార్యశక్తి (చర్య) అన్నింటినీ సమతుల్యంగా ప్రతిపాదించే దివ్య గ్రంథం.

మా వెబ్‌సైట్  లేదా యూట్యూబ్ చానల్ “Namo Narayanaya Bhakthi Channel” లో ఈ దివ్య గ్రంథం  మరాఠీ ఒవీలు తెలుగు లిపిలో కూడా సిద్ధం చేస్తాను.

చాలా మందికి ఉపయోగపడే ఈ దివ్య గ్రంథాన్ని మీ అందరీకీ పరిచయం చేయబోతుండటం నిజంగా అభినందనీయం.

శ్రీ గ్రంథరాజ దాసబోధ మార్గ దర్శకులు :

శ్రీ శ్రీ శ్రీ గోపాల్ మహరాజ్ రామదాసీ ముళే

సంపాదకుడు :  కేశవ్ గోపాల్ మహారాజ్ రామదాసీ ముళే జుక్కల్

తెలుగు లిపి సేకరణ :  దారం భానుప్రకాశ్

పుస్తక ప్రచురణ కర్త :

శ్రీ గోవింద్ మహారాజ్ మఠ సంస్థాన్, జుక్కల్ మరియు డా॥ గాదె నాగభూషణం, హైదరాబాద్

ప్రథమ ముద్రణ :

దాసబోధ జయంతి మాఘ శుద్ధ దశమి, గురువారం, 29 జనవరి 2015

మా మహారాజుల వారి ఆశీర్వచనాలతో మరియు నాన్న ( చుండూరి వెంకట రమణ ) గారి ప్రోద్బలంతో, చుండూరి సంగమేశ్వర్  అను నేను నా యొక్క నమో నారాయణాయ భక్తి ఛానల్ ద్వారా రోజుకి ఒక్కొక్క సమాసం చొప్పున website లో ప్రచూరన చేయాలి అనుకుంటున్నాను. ఈ ప్రచూరన తొంధరగా అయిపోవాలని మీ అందరికి తొందరగా అందించాలి అని ప్రతి ఒక్కరి ఆశీస్సులు నా పై ఉండాలనీ కోరుకుకుంటున్నాను. జై శ్రీరామ్.

🌐 నా ప్రయత్నం – మీ ముందుకు దాసబోధను అందించడం

నా వెబ్‌సైట్‌ ద్వారా మీరు దాసబోధలోని ప్రతి సమాసం (200 Samasaalu) ని సులభంగా చదవగలరని, వాటిని తెలుగు లిపిలో, అలాగే మూల మరాఠీ ఒవీలతో సహా అందించాలనే సంకల్పంతో ఈ సుదీర్ఘ యాత్ర మొదలుపెట్టాను.ఈ క్రమంలో, ప్రతి దశకం యొక్క ప్రతి సమాసం (మోత్తం 20దశకాలు, ఒక్కో దశకంలో 10 సమాసములుగా మొత్తమ్ 200 సమాజాలు ఉన్నాయి.) ఇలా ఒక్కో సమాసాన్ని ఒక్కో పోస్ట్ గా రోజూ publish చేస్తాను.

మీ అభిప్రాయాలు, కామెంట్లు, మరియు భక్తిపూర్వక స్పందనలతో నాకు తెలియజేయగలరని మనసారా కోరుకుంటున్నాను.

🛕 శుభారంభం

ఈ సుదీర్ఘ యాత్రలో మీరంతా భాగస్వాములై, రామదాస స్వామివారి కృపను పొందాలని ఆకాంక్షిస్తూ…

🙏”శ్రీ సమర్థ రామదాస స్వామి చరణారవిందాలకే నమః”

🌺మీ చుండూరి సంగమేశ్వర్/ నమో నారాయణాయ భక్తి ఛానల్


Discover more from Namo Narayanaya Bhakthi Channel

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

error: Content is protected !!