Sri Lakshmi narasimha Swami dandakam – శ్రీ లక్ష్మి నృసింహ దండకమ్ :

జయ జయ శ్రీనృసింహా! సురారా త్యహంకార రంహా! ప్రమత్తేభసింహా! నిరంహస్తమస్సాధు సంకీర్తితాహ్వా! ద్విజిహ్వాది రాడ్భూశణ!

బ్రహ్మ ముఖ్యామరాధీశ కోటీరకోటి స్ఫురద్రత్న కోటీ వినూత్నప్రభా భాసమానాంఘ్రి రాజీవ!

రాజీవభాండ చ్ఛటా సృష్టిరక్షా వినాశ క్రియాధ్యక్ష! దక్షాధ్వరధ్వంసిచేతః ప్రమోదాది నిష్ణాతవేషా! అశేషా జనానీక దుర్లోకదంష్ట్రాన్యజిహ్వా!

నఖాగ్ర క్షణోదగ్ర జాగ్రన్మహావిగ్రహా ప్రగ్రహో దగ్రసింహా! గ్రాహ రూపోగ్ర సంసార బంధచ్ఛిదా చుంచుచంచ ల్లవిత్రాకృతీ! స్వామీ!

నీదివ్యలీలా నికాయంబు లాత్మన్‌ వివేకింపగా నప్రమేయంబులశ్రాంత యోగీంద్ర హృద్గేహముల్‌ పొంగ యాదాద్రి యోగీంద్ర సింహ్వా క్షీరవారాసి కన్యాజ విర్భాంగ ధేయంబుల వ్యానిసేమున్‌ నుతింపన్‌ ప్రవర్తింపుటా హో మహా సాహసిక్యంబు దేవోత్తమా!

సోమకాఖ్యుండు దైతేయ ముఖ్యుండు వాణీవధూనాథు వంచించి ప్రామిన్కు లెల్లన్‌ ప్రమోహించి మున్నీటి పెన్నీటిలోడాగ వానిన్‌, మహామత్స్య రూపంబునన్‌ బుట్టి వారాశిలో బట్టి పుచ్చంబునన్‌ గొట్టి యా వేదముల్‌ తెచ్చి యావేధకున్‌ ప్రీతితో నిచ్చి హెచ్చున్‌ కటాక్షింపవా! వైదికాచార మార్గంబు రక్షింపవా!

దేవతల్‌ దేవాసురుల్‌ సుధోత్పాద నార్థంబుగా మందరాగమ్మునన్‌ వారిరాశిన్‌ మధించగ నప్పర్వతం బబ్ధిలోక్రుంగినన్‌ దాని కూర్మావతారమ్మునున్‌ దాల్చి పైకెత్తవా! కీర్తులన్‌ హత్తవా!

పాపబుద్ధిన్‌ హిరణ్యాక్షుడిద్ధారుణిన్‌ జాపగా జుట్టి పాతాళ లోకంబునన్‌ పెట్ట దానిన్‌ వరాహావతారంబునన్‌ మీటి దంష్ట్రాగ్రభాగంబుచే హెచ్చుగా నెత్తవా!

సర్వమున్‌ విష్ణువేయంచు భాషించు ప్రహ్లాదుపై కిన్కవాటించి యిచ్చోటన్నీవా హరింజూపుమంచున్‌ హిరణ్యాక్ష దైత్యానుజుం డుక్కు కంబంబుడాచేత పాటింప పాటెంచి యందే జ్వలజ్జ్వాల జ్వాలా నృసింహావతారంబునన్‌ బొల్చి ఘోరార్భటిన్‌ రెచ్చి యాదైత్యునిన్‌ ద్రుంచవా! బాలు ప్రహ్లాదు రక్షించి ప్రఖ్యాతిచే లోకముల్‌ మించవా?

వామన బ్రహ్మచర్యాకృతిన్‌ బూని నీవా బలించేరి, ఆదైత్యుచే గోరి పాదత్రయీ మాత్ర భూదానముంబట్టి త్రైవిక్రమాఖ్యావతారంబునుం బూని, మింటన్‌, ధరిత్రిన్‌ పద ద్వంద్వమున్‌నుంచి శిష్టైకపాదంబు తన్మూర్థ భాగంబుపై నుంచి ఆ దైత్యు పాతాళమున్‌ జేర్పవా! వజ్రికిన్‌ కోర్కె చేకూర్చవా?

తండ్రికిన్‌ కీడు వాటించున క్కార్తవీర్యార్జునున్‌ జామదగ్న్యుండవై త్రుంచి శోధించితద్రాజ వంశావళిం గిన్క ముయ్యేడు మారుల్‌ కుఠారాగ్రహేతిన్‌ రణక్షోణి హింసించి, తద్రక్త ధారావళిన్‌ సప్తగర్తంబు లందున్‌ ముదం బొప్పగావించి, వాటిన్‌ ఋణంబార్చి భూభారమున్‌ దీర్పవా!

పంక్తి కంఠుం డకుంఠ ప్రతాపంబునన్‌ వాసవాద్యష్ట దిక్పాలురన్‌ సిద్ధసాధ్యాప్సరో యక్షగంధర్వ విద్యాధర శ్రేణులం బట్టి బాధింపవానిన్‌ నివారింప, ధాత్రిన్‌ దశస్యందన క్షోణి పాలాత్మజాతుండవై రామచంద్రుండవై బుట్టి సీతాసమేతుండవై తండ్రి యాజ్ఞానుసారంబుగా నీరేడు మహారణ్య వాసంబు గావించి, సీతాపహారున్‌ మహావీరు, లంకాపురీ వాసు దేవాదిసంత్రాసు లోకైక విద్రాపణున్‌ భండన క్షోణిలో ద్రుంచి దేవీ సమేతంబుగా రాజ్యముంచెందవా! సర్వలోకస్తుతుల్‌ బొందవా!

ధాత్రి కృష్ణాగ్ర జాతుండవై రౌహిణేయుండవై బుట్టి లీలన్‌ ప్రలంబాది దుష్టాసురశ్రేణి ఖండింపవా!

మీదటన్‌ కల్కిరూపంబునన్‌ మ్లేచ్ఛులన్‌ బట్టనున్నట్టి నీ దివ్య లీలల్‌ ప్రశంసింతు శ్రీశా! విధీశా! సురేశాది ప్రాప్తంబులౌ నీదు రూపంబు కన్గొంటి నా భాగ్యముల్‌ పండె!

ఈశా! రమాధీశ! సర్వేశ! నిర్వికల్పా! పరానంద నిష్యందసంవిత్స్వరూపా! ప్రచండ ప్రతాపా! నృసింహస్వరూపా! రమానారసింహా! నమస్తే నమస్తే నమః॥

దేవాది శేఖరాదీశ దేవాయానంత శక్తయే వ్యక్తావ్యక్త స్వరూపాయ నృసింహాయ నమో నమః॥

మంగళం కోసలేంద్రాయ
మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ
సార్వభౌమాయ మంగళం॥

 

Thank you for watching Sri Lakshmi narasimha Swami dandakam – శ్రీ లక్ష్మి నృసింహ దండకమ్.

Please watch to Subramanya Karavalamba Stotram Telugu Lyrics.

Leave a Reply

error: Content is protected !!